: 'మా వివాహం సక్సెస్ అవ్వడం వెనుక సీక్రెట్ అదే' అంటున్న నికోల్ కిడ్మాన్
హాలీవుడ్ లో వివాహ బంధాలు సుదీర్ఘ కాలం నిలవడం కష్టం. భార్య ఆధిపత్యాన్ని భర్త భరించడు, భర్త ఆధిపత్యాన్ని భార్య భరించదు. దీంతో సుమారు మెజారిటీ వివాహాలన్నీ తక్కువ వ్యవధిలోనే ముక్కలవుతున్నాయి. అయితే వివాహం జరిగి పదేళ్లయినా తాము అన్యోన్యంగా ఉండడం వెనుక సీక్రెట్ ను హాలీవుడ్ తార నికోల్ కిడ్మాన్ వెల్లడించింది. పదేళ్ల దాంపత్య జీవితం అనుభవించినా తమ మధ్య ఎలాంటి ఎడబాటు రాకపోవడానికి కారణం తమ మధ్య ఇంకా ప్రేమ తగ్గకపోవడమేనని తెలిపింది. ఒకవేళ భేదాభిప్రాయాలు వచ్చినా ఇద్దరిలో ఎవరో ఒకరం వెనక్కి తగ్గుతామని నికోల్ చెప్పింది. ఎప్పటికీ ఇలాగే ఉంటామని నికోల్ స్పష్టం చేసింది. కాగా నికోల్ కిడ్మాన్ కు కెయిత్ అర్బన్ ను 2006 జూన్ 25న వివాహం చేసుకుంది. వీరికి ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తమ ఆదర్శదాంపత్యానికి ఆదర్శం తమ తల్లిదండ్రులని, 50వ వివాహ వార్షికోత్సవం చేసుకున్న వారిద్దరూ ఇంకా కలిసే ఉన్నారని నికోల్ కిడ్మాన్ చెప్పింది.