: జేఏసీని, కోదండరాంను పల్లెత్తు మాట అనవద్దు: మంత్రులు, నేతలకు కేసీఆర్ ఆదేశం


తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను, ముఖ్యంగా కోదండరామ్ ను విమర్శించ వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తన క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆదేశించారు. కేసీఆర్ రెండేళ్ల పాలన సందర్భంగా జేఏసీ చైర్మన్ కోదండరామ్, కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై కోదండరామ్ ను తప్పుబడుతూ టీఆర్ఎస్ నేతలు ముప్పేట దాడికి దిగారు. ఈ పరిస్థితిని విపక్షాలు అనుకూలంగా తీసుకుంటాయన్న ఉద్దేశంతోనే కేసీఆర్, జేఏసీ నేతలను విమర్శించవద్దని సూచించినట్టు తెలుస్తోంది. జేఏసీలో మిగిలిన నేతలంతా కోదండరామ్ వెనకే నడుస్తామని చెప్పడం, ఆయన్ను విమర్శిస్తే, ప్రభుత్వం పట్ల ప్రజల్లో అపనమ్మకం రావచ్చన్న అంచనాలు కూడా ఆయన తాజా ఆదేశాలకు కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News