: ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యాణా రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జీల నియామకం
2017లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తుండడంతో ఈ సారి జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో పాగావేసేందుకు ముందుగానే కసరత్తు ప్రారంభించింది. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గులాం నబీ ఆజాద్ ను పార్టీ ఇన్ఛార్జీగా నియమించింది. పంజాబ్, హర్యాణా రాష్ట్రాలకు కమల్ నాథ్ ను నియమించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీలుగా ఆజాద్, కమల్ నాథ్ నియమితులయ్యారు.