: కువైట్ లో ఇస్లాం స్వీకరించిన 250 మంది వలసదారులు
పొట్ట చేతపట్టుకుని వివిధ దేశాల నుంచి ఉపాధి కోసం కువైట్ వెళ్లిన 250 మంది వలసదారులు ఇస్లాం మతం స్వీకరించారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం మొదలైన తొలి ఐదు రోజుల్లోనే 250 మంది వలసదారులు మతం మారడంపై అక్కడ హర్షం వ్యక్తమైంది. ఈ ఏడాది సుమారు 1200 మంది వలస దారులు ముస్లిం మతం పుచ్చుకునే అవకాశం ఉందని ఇస్లాం ప్రెజెంటేషన్ కమిటీ (ఐపీసీ) డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాజిజ్ అహ్మద్ అల్ డ్వెయిజ్ తెలిపారు. మతం స్వీకరించిన వారి కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు.