: చంద్రబాబు కుట్రలు తెలంగాణలో చెల్లవు: హరీశ్ రావు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసినా, అవి తెలంగాణలో చెల్లబోవని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇక్కడి ప్రాజెక్టులను ఎలాగైనా అడ్డుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతో కేంద్రానికి లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. బాబు కుట్రలు తెలంగాణ ప్రాజెక్టులను ఆపలేవని, ఆరునూరైనా, ఇక్కడి అవసరాల నిమిత్తం ప్రాజెక్టులు కట్టే తీరుతామని స్పష్టం చేశారు. తమ ప్రాజెక్టులకు చంద్రబాబు అనుమతి అవసరం లేదని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గోదావరి, కృష్ణా నదులపై చేపట్టిన నిర్మాణాలను ఆపే సమస్యే లేదని హరీశ్ రావు తెలిపారు.