: ఐదు ఆసుపత్రులపై రూ. 600 కోట్ల జరిమానా విధించిన కేజ్రీ సర్కారు


పేదలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించాలన్న నిబంధనకు అంగీకరించి, తక్కువ ధరలకు విలువైన స్థలాలను పొంది, ఆపై ధనవంతులకు మాత్రమే దగ్గరైన ఐదు ఆసుపత్రులపై భారీ జరిమానాను కేజ్రీవాల్ సర్కారు విధించింది. ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకంద్ హాస్పిటల్, ధర్మషీలా క్యాన్సర్ హాస్పిటల్, పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లపై రూ. 600 కోట్ల జరిమానా విధించినట్టు తెలిపింది. మొత్తం 43 కంపెనీలకు ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తూ, వాటిల్లో పేదలకు చౌక వైద్యం అందించాలన్న నిబంధన విధించామని, నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జరిమానాను నెల రోజుల్లోగా చెల్లించకుంటే, వీటిపై తదుపరి చర్యలకు దిగుతామని ఢిల్లీ ప్రభుత్వ అదనపు డైరెక్టర్ (ఈడబ్ల్యుఎస్) డాక్టర్ హేమ్ ప్రకాష్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News