: దుబాయ్ ఎయిర్ పోర్టులో డ్రోన్ హడావిడి.. గంట సేపు ఎయిర్ పోర్ట్ మూసివేత!


అంతర్జాతీయ విమానాలు నిత్యం రాకపోకలు సాగించే దుబాయ్ ఎయిర్ పోర్టును గంటసేపు మూసేసిన ఘటన నేడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...దుబాయ్ ఎయిర్ పోర్టు మీదుగా ఓ అనధికార డ్రోన్ చక్కర్లు కొట్టడాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు ఉదయం 11.36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు మూసేశారు. ఈ సందర్భంగా దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ద్వారా విమానాలకు సూచనలు చేసింది. కొన్ని విమానాలను గాల్లోనే చక్కర్లు కొట్టమని సూచించగా, మరికొన్ని అంతర్జాతీయ విమానాలను దారి మరల్చి దుబాయ్ సెంట్రల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రధమ కర్తవ్యమని తెలిపిన అధికారులు, గత రెండేళ్లలో ఇలా జరగడం రెండోసారని, అంతరాయానికి చింతిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయానికి ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ప్రైవేటు కార్యకలాపాలు, మానవ రహిత వస్తువులు సంచరించేందుకు అనుమతి లేదని తెలిపారు. అనుమానాస్పదంగా ఏదైనా అనిపిస్తే...ప్రయాణికుల ప్రాణాలు కాపాడడమే తమ ప్రధమ కర్తవ్యమని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News