: ఇండియాలో మొట్టమొదటి 'హర్లీ క్వీన్' బేబీ జననం... ఆ పాపకు ఒంటిపై చర్మం లేదు!


ఇండియాలో మొట్టమొదటి హర్లీ క్వీన్ బేబీ జన్మించింది. మహారాష్ట్రలోని వాడి పట్టణానికి చెందిన మహిళ ప్రసవం కోసం భర్తతో కలిసి నాగపూర్ లోని లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరింది. నేటి తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. పాపను చూసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. డానికి కారణం, పాప చర్మం లేకుండా పుట్టడమే! ఇలా పుట్టిన వారిని 'హర్లీ క్వీన్' బేబీస్ అంటారు. ఈ పాప ఇండియాలోనే మొట్టమొదటి 'హర్లీ క్విన్' బేబీ అని ఆమెకు ప్రసవం చేసిన వైద్యులు యష్ బనైత్, ప్రాచీ దీక్షిత్ లు తెలిపారు. పాపను ఐసీయూలోని ఇంక్యుబేటర్ లో పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యులు, బేబీ వివరాలను ఎయిమ్స్ కు పంపామని తెలిపారు. రక్తంలో సోడియం స్థాయి ఎక్కువైనప్పుడు పిండం ఎదుగుదల ఆగిపోతుంది. తద్వారా చర్మం రూపుదిద్దుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయని, దీంతో హర్లీ క్వీన్ బేబీలు జన్మిస్తారని వారు చెప్పారు. ఒంటి మీద చర్మం లేకుండా, ఇతర అవయవాలు కనిపించేలా పుట్టే పిల్లలను వైద్యపరిభాషలో 'హర్లీ క్విన్ బేబీస్' అంటారు. 1750 నుంచి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా డజను మంది హర్లీ క్విన్ బేబీలు జన్మించగా, మెజారిటీ బేబీలు రోజుల వ్యవధిలోనే మరణించారు. ఒకరిద్దరు మాత్రమే యుక్తవయసు వరకు జీవించగలిగారని వారు తెలిపారు. 1750లో అమెరికాలోని దక్షిణ కొరొలినా ప్రాంతంలో మొట్టమొదటి హర్లీ క్విన్ బేబీ జన్మించినట్టు వైద్యులు రికార్డు చేశారు. ఇలా అమెరికాలో ఐదారుగురు హర్లీ క్వీన్ బేబీస్ జన్మించారు. ఆసియాలో 1984లో పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళ వరుసగా నాలుగు ప్రసవాల్లో హర్లీ క్విన్ బేబీలకు జన్మనిచ్చి, వైద్యులకు సవాలు విసిరింది. పుట్టిన నలుగురూ గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో 2014లోనే ఇలాంటి పిల్లలు పుట్టారని చెబుతుంటారు. అయితే దీనిపై ఎలాంటి రికార్డులు లేవు. ఛత్తీస్ గఢ్, బస్తర్ ప్రాంతాల్లో ఈ బేబీలు పుట్టారని వైద్యులు పేర్కొంటుంటారు.

  • Loading...

More Telugu News