: సీబీఐ విచారణ చేయాల్సింది మీ విద్యా సంస్థలపైన... కాపు ఉద్యమంపై కాదు: శైలజానాథ్
ముద్రగడ కోరితే సీబీఐ ఎంక్వయిరీ వేస్తామని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ టీచర్లని కిడ్నాపులు చేస్తున్న కార్పోరేట్ విద్యా సంస్థలపై సీబీఐ విచారణ చేయాలని అన్నారు. ఒక లెక్చరర్ ను మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క విద్యాసంస్థ ఎలా కిడ్నాప్ చేసిందో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. అలాంటి ఘటనలపై సీబీఐ ఎంక్వయరీ వేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ప్రయోజనాలు కాపాడాలని చేసే ఆందోళనలపై సీబీఐ విచారణ చేయడానికి ముందు, కార్పోరేట్ విద్యా సంస్థలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.