: పక్క రాష్ట్రంతో పోల్చితే తెలంగాణకు కేంద్రం ఇచ్చింది శూన్యం: జగదీశ్ రెడ్డి
నల్గొండ జిల్లా సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ నిన్న నిర్వహించిన బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అనుచితం’ అని అన్నారు. ‘పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు శూన్యం’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమేనని ఆయన అన్నారు. బీజేపీ ప్రజా సంక్షేమ ఎజెండాలేని పార్టీ అని ఆయన విమర్శించారు.