: ఉత్తరప్రదేశ్ నుంచి తిరుపతి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా


ఆదిలాబాద్ జిల్లాలో నెయ్యి ట్యాంకర్ బోల్తాపడింది. ఉత్తరప్రదేశ్ నుంచి తిరుపతి వెళ్తున్న ఈ ట్యాంకర్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ లో బోల్తా పడింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటీన చేరుకుని ట్యాంకర్ ను క్రేన్ సాయంతో లేపారు. అప్పటికే కొంత నెయ్యి ఒలిగిపోయింది. అయితే ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, లేని పక్షంలో నెయ్యి నేలపాలు అయి ఉండేదని, అది మరిన్ని ప్రమాదాలకు కారణమై ఉండేదని స్థానికులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News