: పాప్ సింగర్‌ క్రిస్టినా గ్రిమ్మీపై కాల్పులు.. మృతి


అమెరికాలోని ఓర్లాండోలో పాప్ సింగర్‌ క్రిస్టినా గ్రిమ్మీ(22) దారుణ హత్యకు గురైంది. యూట్యూబ్‌ స్టార్‌ గా, అమెరికన్‌ పాప్ సింగర్ గా పేరుపొందిన ఆమెపై ఓ వ్య‌క్తి కాల్పులు జ‌రిపాడు. టీవీ షో 'బి ఫోర్ యు ఎగ్జిట్' ప్రదర్శన ముగిశాక ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఆమె అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ వారికి ఆటోగ్రాఫ్ ఇస్తోన్న స‌మ‌యంలో ఓ దుండ‌గుడు ఆమెపై కాల్పులు జ‌రిపి, అనంత‌రం త‌న‌ని తాను కాల్చుకొని చ‌నిపోయాడు. త‌న‌పై జ‌రిపిన కాల్పుల‌తో తీవ్రంగా గాయ‌ప‌డిన క్రిస్టినా గ్రిమ్మీని ఆసుప‌త్రికి త‌ర‌లించినా లాభం లేక‌పోయింది. ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News