: రాష్ట్రాల్లోనూ సంకీర్ణ యుగం రాబోతోంది: హరీష్ రావు
రాష్ట్రాల్లోనూ సంకీర్ణ యుగం రాబోతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఘంటాపథంగా చెప్పారు. ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరుకే టీఆర్ఎస్ నిర్ణయించిందని తెలిపారు. దాంతో స్వీయ రాజకీయ శక్తిగా ఎదగబోతున్నట్లు ఆయన చెప్పారు. అన్ని పార్టీలకు అజెండాల్లో తెలంగాణ ఒక అంశమైతే, టీఆర్ఎస్ కు తెలంగాణయే అజెండా అని హరీష్ తెలిపారు.
ఇప్పటికే పలు ఉద్యమాలు చేసి చట్టసభలను స్థంభింపజేసామన్న ఆయన, రానున్న కాలంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రభుత్వాలను గడగడ లాడించాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ లో జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభలో హరీష్ ప్రసంగించారు. ఒక్క ఓటుతోనే దేశంలో ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.