: సుదీర్ఘ దర్యాప్తు చేసి అరెస్టు చేశాం.. నిందితులని విడిచి పెట్టమనడం భావ్యంకాదు: గంటా


కాపుల సభ సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసం కేసులో అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష‌కు దిగ‌డం ప‌ట్ల రాష్ట్ర మంత్రి గంటా శ్రీ‌నివాస రావు మ‌రోసారి స్పందించారు. ఈరోజు విశాఖ‌ప‌ట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తుని నిందితులను విడిచిపెట్టాలనడం భావ్యం కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. తునిలో రైలు త‌గ‌ల‌బెట్టి విధ్వంసం సృష్టించిన వారిపై నాలుగు నెల‌లు సుదీర్ఘంగా ద‌ర్యాప్తు జ‌రిపార‌ని ఆయ‌న చెప్పారు. ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ వారి ప‌ట్ల‌ పూర్తి ఆధారాలు ల‌భించాయ‌ని, ఆ త‌రువాతే వారిని అరెస్టు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ముద్ర‌గ‌డ వారిని విడిచి పెట్టాల‌న‌డం భావ్య‌మేనా..? అని ఆయ‌న నిలదీశారు.

  • Loading...

More Telugu News