: కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశాం: సీఎం చంద్రబాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈరోజు విజ‌య‌వాడ‌లో నీటిపారుదల శాఖ కార్యాలయంలో రైతుశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నీటి పారుద‌ల శాఖ అధికారుల‌తో మాట్లాడి ప‌లు విష‌యాల‌ను వెల్లడించారు. తాము చేప‌డుతోన్న సాగునీటి ప్రాజెక్టుల‌ను ఈ ఏడాది డిసెంబ‌రులోపు పూర్తి చేస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. క‌ర‌వు ప్రాంతాల‌కు నీటిని త‌ర‌లించేందుకు శ్రీశైలంలో నీటిని నిల్వ చేస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. పంట‌భూముల‌న్నింటికీ నీరందించేందుకు కృషి చేస్తున్నామ‌ని చంద్రబాబు చెప్పారు. వర్షాలతో 4 నుంచి 5 వేల టీఎంసీల నీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ల‌భిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామ‌ని తెలిపారు. గోదావ‌రి నది వ‌ర్షాల‌కు నిండిపోతే ఆ నీటిని అక్క‌డి నుంచి కృష్ణాకు మ‌ళ్లిస్తామని పేర్కొన్నారు. నీటి కొరతను తీర్చేందుకు కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News