: ఛేజింగ్ కే కెప్టెన్ కూల్ నిర్ణయం... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
జింబాబ్వేలోని హరారేలో మరికాసేపట్లో ఆ దేశ జట్టుతో మొదలుకానున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య దేశం జింబాబ్వే జట్టును అతడు ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మొత్తం కొత్త కుర్రాళ్లతో అక్కడికి వెళ్లిన ధోనీకి... ఈ సిరీస్ పెద్ద సవాలేనని చెప్పాలి. ఈ క్రమంలోనే అతడు ఛేజింగ్ ను ఎంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నాడు.