: ఫ్రాన్స్‌లో రచ్చ రచ్చ చేసిన ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అభిమానులు
ఫ్రాన్స్‌లో ఫుట్‌బాల్ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. రష్యాతో తమ దేశ జట్టు పరాజయం పాలవడంతో ఓటమిని జీర్ణించుకోలేని ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయారు. స్టేడియంలోని ప్రత్యర్థి జట్టు అభిమానులతో దురుసుగా ప్రవర్తించారు. వారితో గొడవ పెట్టుకుని నానా హంగామా సృష్టించారు. తమకు దగ్గరగా ఉన్న వస్తువులన్నింటిని తీసుకొని దూరంగా విసిరేశారు. స్టేడియంలోని బాటిళ్లు, కుర్చీలను రష్యా అభిమానులపై విసిరేశారు. ఘర్షణకు దిగుతోన్న అభిమానులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఫ్రాన్స్‌లో యూరో ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో నిన్న ఇంగ్లండ్, రష్యాల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.