: భార్య వేధింపులపై ఫిర్యాదును పట్టించుకోలేదని... పోలీస్ స్టేషన్ లో భర్త ఆత్మహత్యాయత్నం


భార్య వేధిస్తోందంటూ ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని ఆరోపించిన బాధితుడు పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న ఒక వ్యక్తి తన భార్య వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పోలీసులు స్పందించకపోవడంతో ఆవేదన చెందిన సదరు వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News