: మాస్ మూసలో కొట్టుకుపోయాను...శైలి మారుస్తున్నాను: సినీ హీరో ఆది


మాస్ ఇమేజ్ మూసలో పడి కొట్టుకుపోయానని యువ కథానాయకుడు, సాయికుమార్ తనయుడు ఆది తెలిపాడు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో గతంలో సినిమాలు ఎంచుకున్నానని అన్నాడు. గత సినిమాల్లో కేవలం తన పాత్రవరకే చూసుకునే వాడినని, ఈ క్రమంలో తన పాత్రలు కథ పరిధిని దాటి ప్రవర్తించేవని, అందుకే వైఫల్యాలు ఎదురయ్యాయని భావిస్తున్నానని చెప్పాడు. ఇకపై ఇలాంటి తప్పు జరగకూడదని ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పాడు. తనను అభిమానించేవారు ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలు కావాలని కోరుతున్నారని ఆది తెలిపాడు. సోషల్ మీడియాలో అభిమానులు పలు సూచనలు చేస్తుంటారని ఆది చెప్పాడు. కధలు వింటున్నానని, పకడ్బందీ స్క్రిప్టు కోసం చూస్తున్నానని అన్నాడు. కథ, కథనం బిగి సడలకుండా ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని తెలిపాడు.

  • Loading...

More Telugu News