: గుజరాత్ లోని అణురియాక్టర్లను ఏపీకి మార్చడంలో ఉద్దేశ్యమేంటి?: సీతారాం ఏచూరి ప్రశ్న


గుజరాత్ లో ఏర్పాటు చేయాల్సిన అణురియాక్టర్లను ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వాడకు తరలించడంలో కేంద్రం ఉద్దేశ్యమేంటని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గుజరాత్ ను సేఫ్ గా ఉంచి ఏపీని ప్రమాదంలో పడేస్తారా? అని నిలదీశారు. గుజరాత్ లోని అణురియాక్టర్లను ఏపీకి మార్చడంలో కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. న్యూక్లియర్ రియాక్టర్లను ఒకేచోట పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాల కోసం భారత్ ను మోదీ పావుగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. అణు రియాక్టర్లను గుజరాత్ నుంచి ఏపీకి తరలించడం వంటి ఏకపక్ష నిర్ణయాలను తాము స్వాగతించమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News