: పోలీసులు తప్పులో కాలేశారు...అది రాకెట్ లాంఛర్ కాదు!
ఉత్తరప్రదేశ్ పోలీసులు తప్పులో కాలేశారు. రాకెట్ లాంఛర్ కి, బాష్పవాయువు ప్రయోగించే తుపాకికి తేడా తెలుసుకోలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర లోని వివాదాస్పద జవహర్ బాగ్ పార్కులో ఆందోళనలను అణచివేసిన పోలీసులు, యాంటీ బాంబ్ స్క్వాడ్ దళాలు ఆయుధాలు నిర్వీర్యం చేసుకుంటూ పార్కులోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ లభ్యమైన కవర్ లో 37 ఎంఎం కాలిబర్ గన్, బుల్లెట్లు, మరిన్ని ఆయుధాలు లభ్యమయ్యాయి. దీంతో అమెరికాకు చెందిన రాకెట్ లాంఛర్ ఒకటి లభ్యమైందని పేర్కొంటూ దేశవ్యాప్తంగా వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. అయితే అది రాకెట్ లాంఛర్ కాదని, భాష్పవాయువు ప్రయోగించే గన్ అని వారు తెలిపారు. దీనిని అమెరికాకు చెందిన జెఫర్ సన్ కంపెనీ తయారు చేసిందని మధుర ఎస్పీ వెల్లడించారు.