: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు అమెరికా వ్యాప్తంగా విడతలవారీగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై పైచేయి సాధించిన హిల్లరీ... అధ్యక్ష అభ్యర్థిగా అర్హత సాధించారు. ఇలా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి మహిళగా ఆమె రికార్డు సాధించారు. ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై విజయం సాధిస్తే... అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా హిల్లరీ చరిత్ర సృష్టిస్తారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత దిశగా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఆమె రాజకీయ పరిణతికి అద్దం పడుతున్నాయి. అసలు ట్విట్టర్ సందేశంలో రేణు దేశాయ్ ఏమన్నారంటే... ‘‘ఈ రోజు వరకు ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కూడా లేని దేశం అమెరికానే. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాలను ఏదో ఒక సమయంలో మహిళలు పాలించారు. పాలిస్తున్నారు కూడా. అందుకే హిల్లరీ ఎంపిక నాకు ఆశ్చర్యం కలిగించలేదు’’ అని రేణు దేశాయ్ ఆ సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News