: రైల్వేల్లో మోగిన సమ్మె సైరన్!... జూలై 11 నుంచి నిరవధిక సమ్మెకు కార్మిక సంఘాల నోటీస్!


దేశీయ రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న భారతీయ రైల్వేలో సమ్మె సైరన్ మోగింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు రైల్వే ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయా రీజియన్ల పరిధిలోని కార్మిక సంఘాల ప్రతినిధులు ఎక్కడికక్కడ ఉన్నతాధికారులకు నోటీసులు అందజేశారు. సికింద్రాబాదులోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసిన కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకుంటే... వచ్చే నెల (జూలై) 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఆ నోటీసుల్లో కార్మికులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News