: నిప్పులాంటి మనిషిని!... కేసీఆర్ అంటే నాకెందుకు భయం?: చంద్రబాబు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిన్న జరిగిన మహా సంకల్ప సభ వేదికపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూసి తానెందుకు భయపడతానని ఆయన ప్రశ్నించారు. తాను నిప్పులాంటి మనిషినన్న చంద్రబాబు... ఏ ఒక్కరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినా అవినీతి కేసులున్న జగన్ భయపడాలి గాని తానెందుకు భయపడతానని వ్యాఖ్యానించారు. '43 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డ జగన్... నన్ను ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తాడా?' అని కూడా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.