: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం జిల్లా వాసి నియామకం!
ఏపీ పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీలోని ప్రకాశం జిల్లా కె.బిట్రగుంటకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పాపిశెట్టి రామ్మోహన్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు నిన్న తమిళ సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు అదనపు కార్యదర్శి హోదాలో పనిచేసిన రామ్మోహన్ రావు.. ‘అమ్మ’ పేరిట గడచిన ఐదేళ్లలో జయ సర్కారు ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలోనే ఆయన పనితీరును మెచ్చిన జయలలిత రెండో దఫా సీఎంగా పదవి చేపట్టిన వెంటనే రామ్మోహన్ రావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సీఎస్ పదవిలో ఉన్నా విజిలెన్స్ కమిషనర్ గానూ రామ్మోహన్ రావు అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారని నిన్న విడుదల చేసిన ఉత్తర్వుల్లో జయ సర్కారు తెలిపింది.