: హుండీని దోచేసిన బల్కంపేట ఎల్లమ్మ గుడి పూజారి


గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే ప్రబుద్ధుల్లో హైదరాబాద్ లోని బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయానికి చెందిన ఒక పూజారి కూడా చేరాడు. అమ్మవారికి భక్తులు సమర్పించుకున్న హుండీలోని సొమ్మును, ఆభరణాలను ఆ పూజారి తస్కరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని ఈ సంఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు పూజారులను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. ఆలయం హుండీ దొంగతనానికి గురైన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News