: 'జననీ సేవ'ను ప్రారంభించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు


రైల్వేలలో సంస్కరణలు చేపడుతూ, సరికొత్త సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తూ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తన పనితీరు భిన్నమని చాటుతున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో 'జననీ సేవ'ను రైల్వేల్లో ప్రారంభించారు. గతంలో ఓ మహిళ ట్రైన్ లోను, రైల్వే స్టేషన్లలోను పాలు అందుబాటులో లేవని, తన బిడ్డ తీవ్రంగా ఇబ్బంది పడుతోందని ట్వీట్ ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెంటనే ఆమెకు పాలు అందజేసి ఆమె సమస్యను పరిష్కరించానని అన్నారు. ఆ క్షణంలోనే వారి గురించి ఆలోచించానని, అప్పుడు కనిపించిన పరిష్కారమే 'జననీ సేవ' అని ఆయన చెప్పారు. ప్రయాణాల్లో చాలా మంది తల్లులు శిశువులకు పాల కోసం ఇబ్బంది పడతారని, వారికి పాలు అందుబాటులో లేకపోతే చాలా కష్టంగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించేందుకే 'జననీ సేవ'ను ప్రారంభించామని ఆయన చెప్పారు. ఇకపై ప్రతి రైలులోను, స్టేషన్లలోను 'జననీ సేవ' పాలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News