: మళ్లీ పార్టీ మారి పరువు పోగొట్టుకోవద్దు...గుత్తాకు కోమటిరెడ్డి సూచన


కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతారని తాను భావించడం లేదని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆయన ఇప్పటికే రెండు సార్లు మారారని, ఈసారి పార్టీ మారితే పరువు పోగొట్టుకోవడం ఖాయమని అన్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారినట్టైతే ఎంపీ పదవికి రాజీనామా చేసి, పార్టీ మారాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరిట ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వడ్డీ కట్టడానికి కూడా సరిపోక రైతులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని, తక్షణం రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? అని ఆయన నిలదీశారు. ఆ నిధులను రైతుల బాగుకి ఉపయోగించి ఉంటే ఇంకా బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News