: ఈజిప్ట్ విమానానికి బాంబు బెదిరింపు!... ఉజ్బెకిస్థాన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!


విమానాలకు బాంబు బెదిరింపులకు చెక్ పడటం లేదు. ఈజిప్ట్ రాజధాని కైరో నుంచి చైనా రాజధాని బీజింగ్ కు నేటి ఉదయం బయలుదేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు ఎదురైంది. దీంతో కైరో ఎయిర్ పోర్టులో 135 మంది ప్రయాణికులు, సిబ్బందితో టేకాఫ్ తీసుకున్న సదరు విమానం మూడు గంటల తర్వాత ఉజ్బెకిస్థాన్ పట్టణం ఉర్గెంచ్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది. ఆ వెంటనే ప్రయాణికులను దించేసిన అదికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి కైరో ఎయిర్ పోర్టు అధికారులకు ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు విమానాన్ని ఉజ్బెక్ పట్టణంలో దించేశారు.

  • Loading...

More Telugu News