: ఆ లేఖలో చంద్రబాబు అవాస్తవాలు ప్రస్తావించారు: తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి
కృష్ణానదీ యాజమాన్య బోర్డుపై రాజకీయం చేసేందుకే కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి విమర్శించారు. అవాస్తవాలను ఆ లేఖలో చంద్రబాబు ప్రస్తావించారని ఆరోపించారు. కృష్ణా బోర్డు అంశంపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నా ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. కృష్ణాబోర్డుకు నీటి పంపిణీ అధికారాలిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని వేణుగోపాలాచారి పేర్కొన్నారు. కాగా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి చంద్రబాబు ఇటీవల రాసిన లేఖలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికార పరిధిని ఆలస్యం చేయవద్దని, నిర్ణయాలను బోర్డు అమలు చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకోవచ్చని ఆ లేఖలో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే.