: కర్ణాటకలో 3వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ఆదేశాలు
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో ఏకంగా 3వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలోనూ లేనంతగా భారీ సంఖ్యలో 3వేల స్కూళ్లను మూసేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది. ప్రభుత్వం మూసేయాలని జారీ చేసిన స్కూళ్లలో ఎక్కువ శాతం కన్నడ మీడియం స్కూళ్లే ఉన్నాయి. ఒక్కో స్కూల్లో విద్యనభ్యసిస్తోన్న విద్యార్థుల సంఖ్య 10 కన్నా ఎక్కువ లేకపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యని పెంచడానికి ఆ రాష్ట్ర సర్కార్ తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. దీంతో తక్కువ సంఖ్య విద్యార్థులతో నడుస్తోన్న స్కూళ్లను మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.