: ముద్రగడకు మంత్రి గంటా సూటి ప్రశ్నలు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఖరిపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. తుని ఘటనకు కారకులైన సంఘ విద్రోహశక్తులపై చర్యలు తీసుకోకూడదా? రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సంఘ విద్రోహ శక్తులకు మద్దతునిచ్చే ఎవరినీ ఉపేక్షించేది లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు. కాపు యువకులను అమలాపురంలో అరెస్టు చేశారన్న సమాచారంతో నేటి ఉదయం ముద్రగడ కిర్లంపూడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం, ఈ సమాచారం తెలుసుకున్న కాపులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి రావడం జరిగింది. దీంతో, ముద్రగడను రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు.