: ముద్రగడను తీసుకువెళుతున్న వ్యాన్ పై రాళ్లేసిన కాపులు!...అమలాపురంలో అమల్లోకి సెక్షన్ 30 ఆంక్షలు!
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో క్షణక్షణానికీ ఉద్రిక్తత పెరుగుతోంది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన కాపులు ముద్రగడను ఎక్కించిన పోలీస్ వ్యాన్ పై రాళ్ల దాడితో విరుచుకుపడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు లాఠీలకు పనిచెప్పి కాపులను చెదరగొట్టారు. ఆ తర్వాత ముందు జాగ్రత్త చర్యల కింద పట్టణంలో పోలీస్ యాక్ట్ 30 ఆంక్షలను విధించారు.