: ఆఫర్లు నచ్చడం లేదు... అయిష్టంగానే ఒప్పుకుంటున్నా!!: ఇలియానా


పదేళ్ల క్రితం రామ్ నరసన ‘దేవదాస్‌’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి తెలుగు చిత్రసీమలోకి అరంగ్రేటం చేసిన‌ అందాల నటి ఇలియానా. ఆ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు ప‌క్క‌న 'పోకిరి'లో న‌టించి అప్ప‌ట్లో టాలీవుడ్‌లో అగ్ర‌క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా నిలిచిపోయింది. అనంత‌రం బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టి త‌న అందం, అభిన‌యంతో మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో తెర‌కెక్కుతోన్న 'రుస్తుం' మూవీలో న‌టిస్తోంది. తాజాగా ఈ భామ ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపింది. త‌న సినీ జీవితంపై మ‌న‌సులో మాట చెప్పేసింది. తాను ప‌లు సినిమాల్లో అయిష్టంగానే న‌టించాల్సి వ‌స్తోంద‌ని ఇలియానా పేర్కొంది. త‌నకు వ‌స్తోన్న అవ‌కాశాలేవీ త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ట‌. అయితే త‌న‌కు న‌చ్చలేదని చెప్పి వాటిని వ‌దులుకొని, సినిమాల‌కు దూరం అయిపోతే అది అర్థం లేని నిర్ణ‌య‌మే అవుతుంద‌ని ఈ అమ్మడు చెప్పింది. ఎక్స్ పోజింగ్ చేయ‌డంలో త‌న‌కు అభ్యంత‌రం లేదంటూనే ఇప్పుడు మాత్రం త‌న‌కు సంతృప్తిని క‌లిగించే సినిమాల్లోనే న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది. అక్షయ్‌ కుమార్ హీరోగా తెర‌కెక్కిస్తోన్న 'రుస్తుం' సినిమా మాత్రం త‌న‌కు సంతృప్తినిస్తోంద‌ని చెబుతోంది ఇలియానా.

  • Loading...

More Telugu News