: వాట్సాప్, స్కైపీలను ఆపండి... టెలికం సంస్థల గగ్గోలు!


కమ్యూనికేషన్ సేవలందిస్తున్న వాట్స్ యాప్, స్కైపీ తదితరాలపై కఠిన నియంత్రణను అమలు చేయాలని టెలికం కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. తాము వేల కోట్ల రూపాయలు పెట్టి తరంగాల లైసెన్స్ లు పొందుతుంటే, ఈ యాప్స్ కేవలం డేటా సహాయంతో వాయిస్ కాలింగ్ సేవలందిస్తూ, తమ లాభాలకు గండి కొడుతున్నాయని కాయ్ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ సంస్థలు వీఓఐపీ (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) సేవలు అందిస్తుండటంతో, తమ లైసెన్స్ లకు అర్థం లేకుండా పోతోందని, ఆదాయం కోల్పోతున్నామని ఆయన వివరించారు. సమీప భవిష్యత్తులో వీఓఐపీ కాల్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న నిపుణుల అంచనాలను గుర్తు చేసిన ఆయన, వాయిస్ కాలింగ్ సేవలందిస్తున్న సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అమలు చేయాలని సూచించారు. కాగా, కేవలం డేటాను వాడుతూ సెల్ ఫోన్ల మధ్య కాల్స్ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు 200 శాతానికి పైగా పెరిగినట్టు గణాంకాలు చూపుతున్నాయి.

  • Loading...

More Telugu News