: శంషాబాదులో కలకలం... ఎయిర్ పోర్టు ఆవరణలో 19 కార్లు సీజ్


హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. ఎయిర్ పోర్టు ఆవరణలో ప్రత్యక్షమైన హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు అక్కడి 19 కార్లను సీజ్ చేశారు. ఈ కార్ల యజమానులు అనుమతులు లేకుండానే ఎయిర్ పోర్టు ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు అందిస్తున్నారట. ఈ క్రమంలో ఈ విషయంలో ప్రభుత్వ అనుమతి ఉన్న టూర్ ఆపరేటర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నట్టుండి అక్కడ ట్రాఫిక్ పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రత్యక్షం కావడం, పెద్ద సంఖ్యలో కార్లను స్వాధీనం చేసుకోవడంతో అక్కడ ఏం జరుగుతోందో తెలియక టెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News