: ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది కూడా రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని ఆయన పేర్కొన్నారు. సామరస్యానికి, కరుణ, దాతృత్వానికి మారు పేరు ‘రంజాన్’ అన్నారు.