: కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీ శారద అరెస్టు
కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీ శారదను ధర్మవరం పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. చేనేత కార్మికుల వద్ద వస్త్రాలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకపోవడంపై ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో, ఫిల్మ్ నగర్ లోని కళానికేతన్ ఎండీ ఇంటిపై ధర్మవరం ఎస్ఐ సునీత దాడులు నిర్వహించి, ఆమెను అరెస్ట్ చేశారు.