: కేసీఆర్ కు భట్టివిక్రమార్క సవాల్!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీకాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సవాలు విసిరారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో మధిరలో నిర్మించిన ప్రాజెక్టులపై సీబీఐతో విచారణ చేయించేందుకు సిద్ధమా? అని కేసీఆర్ కు సవాలు విసిరారు. అలాగే దుమ్ముగూడెం, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై కూడా సీబీఐ దర్యాప్తుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత లాభం కోసమే పువ్వాడ అజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో చేరానని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రలో వివిధ ప్రాజెక్టులను చిత్తశుద్ధితో చేపట్టామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News