: రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా రూపాయికే ప్యూరిఫైడ్ వాటర్


రైల్వే స్టేషన్లలో 300 ఎంఎల్ ప్యూరిఫైడ్ వాటర్ ను కేవలం రూపాయికే అందించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఐఆర్ సీటీసీ ప్రయోగాత్మకంగా చేపట్టింది. అయితే వాటర్ బాటిల్, లేదా కంటైనర్ ప్రయాణికులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజ్డ్ వాటర్ లభించినా, దాని ధర కాస్త ఎక్కువగా వుంటుంది. ఇప్పటికే లీటర్ వాటర్ బాటిల్ ను కేవలం 15 రూపాయలకే 'రైల్ నీర్' పేరిట అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 300 ఎంఎల్ నీటిని కేవలం రూపాయి ధరకు న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లోనూ, కాన్పూర్ రైల్వే స్టేషన్లలోనూ పొందవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. త్వరలో ఈ పథకం దేశంలోని అన్ని స్టేషన్లకు విస్తరించనున్నట్టు ఐఆర్సీటీసీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News