: దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వైద్యులను తొలగించండి: చంద్రబాబు ఆదేశం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘ‌కాలిక సెల‌వులు పెట్టి నిర్ల‌క్ష్యం వ‌హిస్తోన్న ప్ర‌భుత్వ వైద్యుల‌ను తొల‌గించాల‌ని ఆయ‌న అధికారులకు సూచించారు. ఆ స్థానాల్లో కొత్త వారిని నియ‌మించాల‌ని ఆదేశించారు. ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కుంటోన్న రాష్ట్రానికి ప‌లు నిర్దిష్ట లక్ష్యాలున్నాయ‌ని, వాటి కోస‌మే మ‌హా సంక‌ల్పం చేప‌డుతున్నామ‌ని, ల‌క్ష్యాలు చేరుకోవాల‌ని సూచించారు. చంద్ర‌న్న బీమాను రానున్న స్వాతంత్ర్య దినోత్స‌వం నుంచి అమ‌లులోకి తీసుకురానున్న‌ట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న‌ వనరులు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి సాధించే దిశ‌గా దూసుకుపోవ‌డ‌మే మహా సంకల్పం అజెండా అని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News