: పాత సినిమాల్లో భేతాళ మాంత్రికులకు వారు ఏమాత్రం తీసిపోరు: టీడీపీ నేతలపై భూమన
పాత సినిమాల్లో భేతాళ మాంత్రికులకు ఏమాత్రం తీసిపోని వారు, రాజకీయ తంత్ర విద్యలన్నింటిని దగ్గర పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి జగన్ మీద టీడీపీ నేతలు యుద్ధం ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ నుంచి ఏపీ పరిపాలన కొనసాగిస్తే ఊరుకోమన్న కేసీఆర్ బెదిరింపులకు భయపడ్డ చంద్రబాబు, ఇక్కడి ఉద్యోగులను బలవంతంగా అమరావతికి తరలించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో గట్టి ప్రతిపక్షం ఏర్పడితే, దానిని చీల్చి ఒక్కొక్కరికీ రూ.30 కోట్లు, రూ.40 కోట్లు ఇచ్చి జగన్ నాయకత్వాన్ని బలహీనపరచడానికి చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని భూమన హెచ్చరించారు.