: పరపతి సమీక్ష చేసే 'ఆఖరి ఆర్బీఐ గవర్నర్' రఘురాం రాజన్!


పరపతి సమీక్ష చేసే ఆఖరి ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నిలువనున్నారు. ఆయన సమక్షంలో చివరి పరపతి సమీక్ష రేపు జరగనుంది. కీలక రేట్లు మార్చే అవకాశం లేదని అత్యధికులు భావిస్తున్నారు. కాగా, భవిష్యత్ లో జరగబోయే పరపతి సమీక్ష సమావేశాలను ఆర్బీఐ గవర్నర్ కు బదులుగా ఆరుగురు సభ్యులతో కూడిన బృందం నిర్వహిస్తుందని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురిలో ముగ్గురిని ప్రభుత్వం, మరో ముగ్గురిని ఆర్బీఐ నియమిస్తుంది. పరపతి సమీక్ష కమిటి తీసుకునే నిర్ణయాన్ని ఆర్బీఐ అనుసరించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణయం తీసుకోవడంలో ‘టై’ అయిన పక్షంలో ఆర్బీఐ గవర్నర్ తన ఓటు ద్వారా తుది నిర్ణయానికి సహకరిస్తారు.

  • Loading...

More Telugu News