: ఎట్టకేలకు దిగొచ్చిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’.. జరిమానా చెల్లింపు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. గ్రీన్ ట్రైబ్యునల్ తమపై విధించిన జరిమానాను కట్టేసింది. ఢిల్లీ వేదికగా యమునా నదీ తీరాన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ ఏడాది మార్చిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉత్సవాలతో అక్కడి పరిసరాల్లో కాలుష్యానికి కారణమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ జరిమానా కట్టాల్సిందేనని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పింది. జరిమానాను కడతామని మొదట అంగీకరించిన ఆ సంస్థ తమపై విధించిన రూ.5 కోట్ల జరిమానాలో రూ.25 లక్షల పరిహారం చెల్లించి, మిగతా జరిమానాను తరువాత చెల్లిస్తామని తెలిపింది. అయితే, ఆ తరువాత మాట మార్చేసి జరిమానాను ఎగ్గొట్టడానికి కోర్టుల చుట్టూ తిరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చెల్లించాల్సిన మిగతా రూ.4.75కోట్ల జరినామా చెల్లించాల్సిందేనని వారం రోజుల ముందు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మరోసారి గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో ఆ సంస్థ దిగొచ్చి పూర్తి జరిమానాను చెల్లించింది. దీనిపై మరికాసేపట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీడియాకు ఈ అంశంపై పలువివరాలు తెలపనున్నట్లు సమాచారం.