: ఎట్ట‌కేల‌కు పుదుచ్చేరిలో కొలువుదీరిన ప్ర‌భుత్వం.. సీఎంగా నారాయ‌ణస్వామి ప్ర‌మాణ స్వీకారం


పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు కొలువుదీరింది. ఇటీవ‌ల నాలుగు రాష్ట్రాల‌తో పాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన విష‌యం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో అంత‌ర్గత విభేదాల కారణంగా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎన్నిక అంశంలో సందిగ్ధ‌త ఏర్ప‌డింది. చివ‌ర‌కు కాంగ్రెస్ అధిష్ఠానం ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి నారాయ‌ణస్వామిని నియ‌మిస్తూ నిర్ణయం తీసుకోవడంతో నేడు అక్క‌డ‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ముఖ్య‌మంత్రిగా నారాయ‌ణ స్వామి చేత ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. నారాయ‌ణస్వామి స‌హా ఆరుగురు నేత‌లు ఆ రాష్ట్ర మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News