: కచ్చదీవిని జయలలిత తిరిగి తీసుకువస్తారు... జయలలితపై నమ్మకం పెట్టుకున్న స్టాలిన్!


గతంలో శ్రీలంకకు ఇచ్చేసిన కచ్చదీవిని జయలలిత తిరిగి తీసుకువస్తారన్న నమ్మకం తనకుందని తమిళనాట విపక్ష నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ వ్యాఖ్యానించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. రంజాన్ మాసం ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేస్తూ, తమిళ ప్రజల కోసం ఖాయిదే మిల్లత్ ఎంతో త్యాగం చేశారని కొనియాడారు. కచ్చ దీవులను జయలలిత రాష్ట్ర అధీనంలోకి తెస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆమె విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

  • Loading...

More Telugu News