: గాల్లో ఉండగా భారీ కుదుపులకు లోనైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం
మలేషియా ఎయిర్లైన్స్ విమానం నిన్న భారీ కుదుపులకు గురైంది. అదృష్టం బాగుండి పెను ప్రమాదం బారినుండి తప్పించుకుంది. విమానం ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో దానిలో ఉన్న 378 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. లండన్ నుంచి మలేషియాకు ప్రయాణిస్తోన్న ఎమ్హెచ్1 విమానం కుదుపులకు గురవడంతో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కుదుపులతో దానిలోని ప్రయాణికులు అటూ ఇటూ ఎగిరి పడ్డారు. రెండు నిమిషాలు చావుని దగ్గరలో చూసిన ప్రయాణికులు అనంతరం విమానం సాధారణ స్థితిలోకి రాగానే ఊపిరి పీల్చుకున్నారు. విమానం కౌలాలంపూర్ చేరుకోగానే గాయపడ్డ ప్రయాణికులకు వెంటనే చికిత్స అందించారు.