: ఢిల్లీ ఫ్లైటెక్కిన హరీశ్ రావు!... సాయంత్రం కృష్ణా బోర్డుపై ఉమా భారతికి ఫిర్యాదు!


రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య పొడచూపిన జల వివాదాలు మరింత ముదిరాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీకే అనుకూలంగా వ్యవహరిస్తూ తమ హక్కులను కాలరాస్తోందంటూ తెలంగాణ సర్కారు నేడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు... సాగునీటి శాఖ అధికారులు, మరికొంత మంది ప్రజా ప్రతినిధులతో కలిసి హైదరాబాదులో కాసేపటి క్రితం ఢిల్లీ ఫ్లైటెక్కారు. నేటి సాయంత్రం ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో భేటీ కానున్నారు. ఈ భేటీలోనే ఆయన కృష్ణా బోర్డుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News