: తుని సభ పెట్టమని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రోత్సహించారు: ముద్రగడ
తుని సభ నిర్వహించమని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తనను ప్రోత్సహించారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. నన్ను ప్రోత్సహించిన వారిలో కాపు కులాలకు చెందిన ఎమ్మెల్యేలు కాకుండా ఇతర కులాలకు చెందిన ఎమ్మెల్యేలూ ఉన్నారని, ఇప్పుడేమో, నన్ను తిడుతున్నారని, వాళ్లు మాత్రం చంద్రబాబు నుంచి రాచమర్యాదలు పొందుతున్నారని ఆయన విమర్శించారు. చెక్క భజన చేసే బృందానికి పదవులకు రాజీనామా చేసే ధైర్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లకు కలిసి రాని ద్రోహుల సంగతి జాతే తేలుస్తుందని ముద్రగడ అన్నారు.