: భారత్-ఖతార్ మధ్య కుదిరిన ఏడు ఒప్పందాలు
భారత్-ఖతార్ దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక బంధాల బలోపేతంలో భాగంగానే ఇరుదేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. పర్యాటకం, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య రంగంలో సహకారం, జాతీయ పెట్టుబడులు, మౌలిక వసతులకు నిధులు, యువత-క్రీడలు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సమాచార కేంద్రం ఏర్పాటు విషయాలలో ఈ ఒప్పందాలు కుదిరాయి. కాగా, దోహాలో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకుగాను ఖతార్ పారిశ్రామిక వేత్తలను మోదీ ఆహ్వానించారు.